- థియేటర్ల వద్ద అభిమానుల పూనకాలు
- దుమ్ములేపుతున్న రజినీకాంత్ సినిమా
- టైగర్ ముత్తువెల్ పాండియన్ రికార్డుల వేట
- అనిరుధ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్
- దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
- రివ్యూ రేటింగ్: 2.80/5
సహనం వందే, హైదరాబాద్:
ఏ సినిమా వస్తే థియేటర్ల వద్ద పూనకాలు వస్తాయో, ఏ హీరో నడిచి వస్తుంటే స్క్రీన్ షేక్ అయిపోతుందో ప్రత్యేకంగా చెప్పాలా? అబ్బో, ఆ పేరు వింటేనే బాక్సాఫీస్ బద్దలైపోతుందిలెండి! మన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్- 2 గురువారం థియేటర్లలోకి వచ్చేసింది. అసలు మొదటి భాగం అందించిన సెన్సేషనల్ హిట్ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? ఈ కంప్లీట్ రివ్యూలో తెల్సుకుందాం పదండి!
మార్క్ కామెడీ, మైండ్ గేమ్స్
రజినీ స్టైల్ మిస్ కాకుండా కథను నడిపించడంలో దర్శకుడు నెల్సన్ సఫలమయ్యాడు. కథ మొదటి భాగం ముగిసిన చోటు నుంచే ప్రారంభమవుతుంది. రిటైర్డ్ జైలర్ టైగర్ ముత్తువెల్ పాండియన్ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ విలన్లను ఎలా ఎదిరించాడనేదే మెయిన్ స్టోరీ. విలన్ గ్యాంగ్ అమాయకత్వం, వాటిని రజినీ డీల్ చేసే తీరు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ప్రధాన విలన్లుగా ఎస్.జె. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, నమో నారాయణ తమ నటనతో ఆకట్టుకున్నారు. వీళ్ల మధ్య నడిచే మైండ్ గేమ్స్, బలమైన విలన్ పాత్రల వల్ల హీరో ఎలివేషన్ సీన్లు మరింత బాగా వర్కవుట్ అయ్యాయి.
గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్లు
సినిమాలోని టీ-షాప్ షూటింగ్ సీక్వెన్స్, బ్రిడ్జ్ వద్ద వచ్చే యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయి. రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ ఈ యాక్షన్ ఎపిసోడ్లను వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా రిచ్‌గా ఉండి, ఫ్యాన్స్‌కు పూర్తి మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ను అందిస్తుంది. రజినీకాంత్ మేనరిజమ్స్ మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి.
అనిరుధ్ ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. రజినీకాంత్ ఎంట్రీ సీన్లకు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఈలలు వేయిస్తుంది. పాటల కంటే బీజీఎమ్‌తోనే సినిమాను నడిపించాడు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ కోయంబత్తూరు, గోవా అందాలను తెరపై ఆకర్షణీయంగా చూపించింది. అయితే 2 గంటల 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ చిత్రంలో ద్వితీయార్థంలో ఎడిటింగ్ మరికొంత క్రిస్పీగా ఉంటే బాగుండేది.
ఊహించని సర్ప్రైజ్ స్టార్ క్యామియోలు
గత భాగంలో అలరించిన శివరాజ్‌కుమార్‌తో పాటు హృతిక్ రోషన్, మోహన్‌లాల్ క్యామియోలు అభిమానులకు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ పాత్ర వచ్చే సీన్ ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంది. సినిమాలో కొన్ని లాజికల్ లోపాలు ఉన్నప్పటికీ, నెల్సన్ రాసుకున్న కమర్షియల్ హంగులు ప్రతి పది నిమిషాలకు ఒక హై మూమెంట్‌ను ఇస్తాయి. సెకండ్ హాఫ్ కాస్త తడబడినప్పటికీ, క్లైమాక్స్ సంతృప్తికరంగా ఉంటుంది.
దసరా పండుగకు జోష్…
జైలర్ 2… మొదటి భాగం అంత ఫ్రెష్‌గా లేకపోయినా రజినీకాంత్ స్టార్డమ్, నెల్సన్ ఎంటర్టైన్మెంట్తో నిరాశపరచదు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మూడో భాగం ఉంటుందని లీవ్ ఇవ్వడం మేకర్స్ ఇచ్చే డబుల్ ట్రీట్. రజినీ అభిమానులకు ఈ సినిమా దసరా పండుగకు జోష్ తెచ్చింది.