జానపదాల జ్వాలలో ఏశనాగుల సాంగ్ – ది ప్యారడైజ్ సినిమా పాటకు 3 కోట్ల వ్యూస్

The Paradise Yeasa Nagula Song
  • మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బీట్స్ గూస్‌బంప్స్
  • దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో రికార్డ్ ట్రెండ్
  • పిచ్చెక్కిస్తున్న నాని, కీర్తి సురేష్ డ్యాన్సు

సహనం వందే, హైదరాబాద్:

న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని ఏశనాగుల పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో ఇండియా వైడ్‌గా నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది.

ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్‌లో ది ప్యారడైజ్ సినిమా ముందు వరుసలో నిలబడుతుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ సినిమా ఇచ్చిన బిగ్గెస్ట్ సక్సెస్ జోష్‌తోనే ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ మీద అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.

The Paradise Yesa Nagula Song

3 కోట్ల వ్యూస్‌ను దాటేసిన ఏశనాగుల సాంగ్
ఈ క్రమంలోనే రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన ఏశనాగుల పాట సోషల్ మీడియాలో అసలు సిసలైన మాస్ జాతరను తలపిస్తోంది. సాంగ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో ఇండియా వైడ్ నంబర్ వన్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ఏకంగా 3 కోట్ల వ్యూస్‌ను దాటేసి దూసుకుపోతుండడంతో నాని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పాటకు వస్తున్న ఈ అద్భుతమైన స్పందన చూస్తుంటే సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించబోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్
ఈ వైబ్రెంట్ సాంగ్‌కు టాలెంటెడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన సంగీతంతో ప్రాణం పోశారు. ఏశనాగుల పాటకు అనిరుధ్ అందించిన పవర్‌ఫుల్ మాస్ బీట్స్ ఈ సాంగ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి. తెలంగాణ జానపద సంగీతంలోని అసలైన మట్టి వాసనలను తీసుకుని, దానికి తనదైన స్టైల్ మోడ్రన్ మ్యూజిక్ టచ్‌ను జోడించి అనిరుధ్ ఈ పాటను కంపోజ్ చేశారు. దీనివల్ల పల్లెటూరి నేటివిటీ ఏమాత్రం మిస్ కాకుండానే నూటికి నూరు శాతం మాస్ ఎనర్జీ ఈ పాటలో ఉరకలేస్తుందని చెప్పవచ్చు.

కాసర్ల శ్యామ్ సాహిత్యం… గాయకుల జోరు
ఇక ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మరో పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి సంస్కృతిని కళ్లకు కట్టేలా ఆయన రాసిన పదాలు పాటకు అదనపు బలాన్ని చేకూర్చాయి. కేవలం క్యాచీ పదాలు వాడడమే కాకుండా నేటివిటీకి తగ్గట్టుగా సాగే లిరిక్స్ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ పాట ఇంతలా సక్సెస్ కావడంలో గాయకుల పాత్ర కూడా చాలా కీలకమైందని చెప్పాలి. ప్రభా బంగారిగళ్ల, అద్దుల జంగిరెడ్డి తమకంటూ ప్రత్యేకమైన గాత్రంతో ఈ పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. వీరిద్దరి వాయిస్‌లో ఉన్న రా అండ్ రస్టిక్ నేచర్ అనిరుధ్ అందించిన మాస్ బీట్స్‌తో కలిసి ఏశనాగుల పాటను ఒక రేంజ్‌లో నిలబెట్టాయి. ఈ పాటకు నాని, కీర్తి సురేష్ వేసిన డాన్స్ ఉర్రూతలు ఊగిస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *