రాత్రికి రాత్రే రాజయోగం…! – కష్టపడినా దక్కని రూపాయి

GenZ Income Earning Thoughts
  • షార్ట్‌కట్ వైపే యువత దారి
  • పొదుపు పాఠాలకు చరమగీతం
  • మారిన ఆర్థిక ఆలోచనలు
  • వ్యవస్థాగత లోపాలే కారణం
  • జెన్ జెడ్ గ్లోబల్ ఫ్రస్ట్రేషన్
  • మారిన ఆర్థిక ఆలోచనలు

సహనం వందే, హైదరాబాద్:

కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ మిగలని ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై నేటి తరం తీవ్ర అసంతృప్తితో ఉంది. సమాజంలో అంతా రిగ్గింగ్ జరిగిందని భావిస్తున్న యువత తమ కలలను నిజం చేసుకోవడానికి ఇప్పుడు కొత్త దారులను వెతుకుతోంది. ఈ వ్యవస్థాగత వైఫల్యం సృష్టిస్తున్న సామాజిక సంక్షోభంపై ప్రత్యేక విశ్లేషణ.

మారిన ఆర్థిక ఆలోచనలు
ఈ రోజుల్లో రూపాయి సంపాదించడం ఎంతో కష్టంగా మారింది. పొద్దున లేస్తే రాత్రి దాకా గొడ్డు చాకిరీ చేసినా నెల తిరిగేసరికి చేతిలో ఏమీ మిగలడం లేదు. మరి ఇలాంటి టైమ్‌లో మన యువత ఏం చేస్తోంది. పెళ్లిళ్లు, ఇళ్లు, కార్లు కొనేందుకు పైసలు ఎక్కడి నుంచి తెస్తోంది. కష్టపడితే లాభం లేదు. ఈ సిస్టమ్ మొత్తం కొందరి కోసమే తయారైంది అని నేటి తరం ఫిక్స్ అయిపోయింది. షార్ట్‌కట్‌లో కోటీశ్వరులు కావడానికి యువత అడుగులు వేస్తోంది. ఫేమస్ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ హేలీ సాక్స్ బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.

జెన్ జెడ్ తీవ్ర నిరాశ
నిజానికి ఇది ఒక్కరిద్దరి సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెన్ జెడ్, మిలీనియల్స్ యువత అంతా ఇదే తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంత చదివినా ఉద్యోగాలు రావడం లేదు. ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా ఇచ్చే జీతాలు పెరిగే ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో గ్లోబల్ లెవెల్‌లో యువతలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. ఎంత నిజాయితీగా పనిచేసినా ఈ సమాజంలో తాము పైకి రాలేమని వారు నమ్ముతున్నారు. ఇక్కడ అంతా రిగ్గింగ్ జరిగిందని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ డ్రామాటిక్ చేంజ్ వల్లే వారు ఇప్పుడు పెద్ద రిస్క్ తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.

పాత నమ్మకాల పతనం…
అసలు విషయం ఏంటంటే పాత తరం వాళ్లు రూపాయి రూపాయి కూడబెట్టేవారు. పొదుపు చేసి, ఇల్లు కట్టుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యేవారు. కానీ ఇప్పటి జనరేషన్‌కు ఆ నమ్మకం పూర్తిగా పోయింది. ఎందుకంటే ఒక సాధారణ ఇల్లు కొనాలన్నా మార్కెట్లో కోట్లలో ధరలు పలుకుతున్నాయి. ఇవాల్టి జీతాలతో అంత పెద్ద మొత్తాన్ని దాచడం ఇంపాజిబుల్ అని వాళ్లకు అర్థమైపోయింది. అందుకే ఎలాగూ నార్మల్‌గా బతికితే ఏం సాధించలేం అని భావిస్తున్నారు. షార్ట్‌కట్ థాట్స్‌లోకి యువత వేగంగా వెళ్తోంది.

కోల్పోతున్న కష్టార్జితం
మరి దీని వల్ల సాధారణ యువతకు ప్రాక్టికల్‌గా ఏమైనా లాభం జరుగుతోందా అంటే లేదు. వంద మందిలో ఒకరిద్దరు అదృష్టం కొద్దీ రాత్రికి రాత్రే లక్షాధికారులు అవుతుండవచ్చు. కానీ మిగిలిన 98 మంది తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. లేదా తల్లిదండ్రుల సొమ్మును పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. మొదట్లో సరదాగా చిన్న మొత్తాలతో మొదలయ్యే ఈ అలవాటు ఆ తర్వాత పెద్ద అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. గెలిచినప్పుడు వచ్చే కిక్ కంటే ఓడిపోయినప్పుడు వచ్చే డిప్రెషన్ యువత ప్రాణాల మీదకు తెస్తోంది.

వ్యవస్థ మారాల్సిన సమయం
ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్ హేలీ సాక్స్ చెప్పిన దాని ప్రకారం యువతకు సరైన ఫైనాన్షియల్ గైడెన్స్ లేకపోవడం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. స్కూళ్లలో, కాలేజీల్లో డబ్బును ఎలా మేనేజ్ చేయాలి, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయాలో నేర్పించడం లేదు. కేవలం డబ్బు సంపాదించు అని మాత్రమే చెప్తున్నారు తప్ప దాన్ని సరైన మార్గంలో ఎలా పెంచాలో చెప్పేవాళ్లు కరువయ్యారు. దీనివల్ల సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి యువత ఈజీగా మోసపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే కేవలం యువతను తిడితే సరిపోదు. వ్యవస్థలో కూడా మార్పు రావాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *