నాబార్డు చైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని, సూక్ష్మ సేద్యానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, సహకార సంఘాలను బలోపేతం చేయాలని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకం రూపొందించాలని, ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను…

Read More

తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవాన్ష్ చేతుల మీదుగా ప్రసాదాల పంపిణీ చేశారు. దేవాన్ష్ కూడా తన తాతతోపాటు భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డించి, వారి ఆశీర్వాదాలు పొందాడు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అన్నదాన ట్రస్ట్…

Read More

ప్రతిపక్షం… ప్రజాధిక్కారం…!

ప్రజా తీర్పును అవహేళన చేస్తున్న కేసీఆర్, జగన్ – సీఎం కుర్చీ నుంచి దింపినందుకు అసెంబ్లీకి రానంటున్న మాజీ సీఎంలు – అలాంటప్పుడు సభ్యులుగా కొనసాగడం అవసరమా? – ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండంటున్న ప్రజలు – ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకుంటే మీరెందుకు? – అసెంబ్లీకి రాకుండానే లక్షల వేతనాలు దండగ అంటూ విసుర్లు – సోషల్ మీడియా, ట్విట్టర్ పోస్టింగులకే పరిమితమా? సహనం వందే, హైదరాబాద్/అమరావతి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి,…

Read More

హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీల ప్రీ-ఈవెంట్

– యాదగిరిగుట్ట ఆలయం అనుభూతి ఇచ్చిందన్న 2024 ప్రపంచ సుందరి – మే నెలలో మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అద్వితీయ ఆతిథ్యం! సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి గురువారం ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్…

Read More

కాంగ్రెస్ తెచ్చిన కరువు – తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శ

సహనం వందే, సూర్యాపేట: “నీళ్ల మంత్రి నల్లగొండలోనే ఉన్నా చుక్క నీరు తేలేకపోవడం సిగ్గుచేటు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సూర్యాపేటలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం” అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు…

Read More

దశాబ్దాల నిరీక్షణకు తెర – 57,924 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో రేవంత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు!

సహనం వందే, హైదరాబాద్: “కొలువుల పండుగ” సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మీ కల నేడు నిజమైంది. ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న 922 మందికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి తావులేదు… గత…

Read More

బడ్జెట్ రూ. 3.04 లక్షల కోట్లు

సహనం వందే, హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 3 లక్షల 4 వేల 965 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2 లక్షల 26 వేల 982 కోట్లు కాగా, మూలధన వ్యయం 36 వేల 504 కోట్లుగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ముఖ్యంగా రైతు భరోసా పథకానికి 18 వేల కోట్లు,…

Read More

జయహో సునీత విలియమ్స్

– 9 నెలల అంతరిక్ష వాసం తర్వాత సురక్షితంగా భూమికి చేరిక – ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్… వైద్య పరీక్షలు… ప్రపంచవ్యాప్త ఆసక్తి సహనం వందే, హైదరాబాద్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు నాసా అస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు బుధవారం (మార్చి 19) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు….

Read More

పసుపుకు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి

సహనం వందే, హైదరాబాద్:పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పసుపు రైతులను పట్టించుకోలేదని, కానీ ప్రతిపక్షంలోకి వచ్చాకా.. పసుపు రైతులపై దొంగ ప్రేమ ఒలకపోస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పసుపు రైతులు ఆందోళన చేస్తే… రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు పెట్టి, కేసులు పెట్టి జైల్లో వేసిన చరిత్ర మీది అని గుర్తుచేశారు. తనపై సైతం కేసులు పెట్టినట్లు తెలిపారు. మంగళవారం ఆయన హాకా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు…

Read More

ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ బిల్లు… చేతులు దులుపుకున్న తెలంగాణ ప్రభుత్వం

సహనం వందే, హైదరాబాద్:బీసీ రిజర్వేషన్ల బిల్లును ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందితే, దానివల్ల రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు మరింత మెరుగుపడతాయి. దీనివల్ల కొన్ని వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే, ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదించకపోతే, ఈ బిల్లు చట్టంగా మారడం కష్టం. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ బిల్లును సమర్థిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లును…

Read More