
యాపిల్ ‘ఎయిర్’… క్వాలిటీ ఫెయిల్ – అందమైన ఐఫోన్… కొన్నారో పరేషాన్
సహనం వందే, హైదరాబాద్:యాపిల్ సంస్థ ప్రతీ ఏటా కొత్త ఐఫోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. అంతకుముందు వెర్షన్లలో కొన్ని మార్పులు, కెమెరా అప్డేట్స్ వంటి వాటితోనే చాలావరకు సరిపెడుతుంది. కానీ ఈసారి అలా కాకుండా అత్యంత సన్నని డిజైన్‌తో కూడిన ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. ఇంత సన్నగా ఉండడం వల్లే ఎయిర్ మోడల్ గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతున్నారు. మెరిసే టైటానియం ఫ్రేమ్,…