
ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
సహనం వందే, హైదరాబాద్:శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయశాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేసే కార్యానికి సంస్థ శ్రీకారం చుట్టింది. తలంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలతో పాటు సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.inలో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు…