Apple Siri

యాపిల్ ‘సిరి’… రోబో మనిషి – ఐఓఎస్ 27 విప్లవం… ‘సిరి’ సరికొత్త రూపం

సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన వినియోగదారుల కోసం ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసింది. మన చేతిలో ఉండే ఐఫోన్ నుంచి ఇంట్లో ఉండే కంప్యూటర్ వరకు అన్నింటినీ పూర్తిగా మార్చేయబోతోంది. ముఖ్యంగా మన మాట వినే ‘సిరి’ ఇకపై మనిషిలా ఆలోచించి పనులు చేయనుంది. ఇన్నాళ్లూ యాపిల్ ల్యాప్‌టాప్‌లలో లేని టచ్ స్క్రీన్ సౌకర్యం కూడా రాబోతుండటం విశేషం. ఈ మార్పులు సామాన్యుల డిజిటల్ జీవితాన్ని మరింత సులభతరం చేయనున్నాయి. సిరి…

Read More
Bride Beauty -Weight Loss Injections

బరువు మాత్ర మంగళసూత్ర – అందం కోసం పెళ్లికూతురుకు ఇంజెక్షన్లు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ పెళ్లిళ్లలో ఇప్పుడు ఒక ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోంది. పెళ్లి పీటల మీద సన్నగా మెరిసిపోవాలనే ఆరాటంతో వధువులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పెళ్లి ప్యాకేజీల్లో భాగంగా అందం కోసం బరువు తగ్గించే జీఎల్పీ-1 ఇంజెక్షన్లను వాడటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. ఆకలిని చంపేసే ఈ మందులు శరీరంలోని జీవక్రియలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ మందుల దుర్వినియోగం పెను విపత్తుకు దారితీస్తోంది. ఆకలిని అణచివేసే మాయపెళ్లికి కొన్ని నెలల ముందు నుంచే…

Read More
Cinema

పేరు గొప్ప… ‘సినిమా’ దిబ్బ! – హాలీవుడ్ కలలు… వీఎఫ్ఎక్స్ కష్టాలు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ సినిమా ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎగిరిపోవాలని కలలు కంటోంది. పాన్ ఇండియా అనే పాత పంథాను వీడి పాన్ వరల్డ్ స్థాయికి చేరాలని తహతహలాడుతోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. భారీ ఆశలకు, అందుబాటులో ఉన్న వనరులకు మధ్య అంతరం కొండంత కనిపిస్తోంది. సాంకేతిక లోపాలు, అర్థం లేని జాప్యాల మధ్య భారతీయ సినిమా ప్రపంచ స్థాయి కల భారంగా మారుతోంది. కలల భారతందురందర్, ఆర్ఆర్ఆర్, దంగల్ వంటి చిత్రాల…

Read More
Women Related News

సెలబ్రిటీలకు మీడి(ద)యా – మహిళా ఘోష వినపడలేదా?

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఎంత డిజిటల్ మాయాజాలంలో మునిగితేలుతున్నా మహిళల పట్ల వివక్ష మాత్రం పాతాళానికి చేరుతోంది. కృత్రిమ మేధస్సు సాయంతో మహిళలపై జరుగుతున్న హింస కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకవైపు అమానవీయ ఘటనలు పెరుగుతుంటే మరోవైపు మీడియా వాటిని విస్మరిస్తోంది. ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న ఈ ఘోరాలపై లోతైన చర్చ అవసరం. పడిపోయిన ప్రాధాన్యతయూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెంటర్ ఫర్ జర్నలిజం అండ్ డెమోక్రసీ, గ్లోబల్ మీడియా మానిటరింగ్ ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా…

Read More
Delimitation bill And Mahila Reservation Bill

మహిళా బిల్లుకు డీ’లిటిగేషన్’ – మహిళా, డిలిమిటేషన్ బిల్లులకు లింకేంటి?

సహనం వందే, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన కేంద్ర సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి సీట్ల సంఖ్యను పెంచి తద్వారా దక్షిణాది ప్రాబల్యాన్ని తగ్గించాలనే పాలకుల కుట్రను ప్రతిపక్షాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా తెరపైకి తెచ్చిన ఈ నిబంధన రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. కేవలం మహిళల కోటా కోసమే కాకుండా తమ ప్రాంతీయ హక్కుల పరిరక్షణ కోసం…

Read More
Kavitha

కవిత మను’గడగడ’ – ముగిసిన షర్మిల ముచ్చట… విజయశాంతి అడ్రస్ గల్లంతు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల పుట్టుక ఒక సంచలనమైతే… వాటి అదృశ్యం అంతకంటే పెద్ద మిస్టరీగా మారింది. ఉద్యమ నేతలు, సినిమా స్టార్లు, మేధావులు పెట్టిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోగా ఇప్పుడు కవిత తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో పుట్టబోయే ఈ పార్టీ రాజకీయాల్లో ఏ మేరకు నిలదొక్కుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరుస వైఫల్యాల చరిత్రతెలంగాణ గడ్డపై పార్టీ పెట్టిన ఏ ఒక్కరూ కూడా…

Read More
TCS Nasik Women Employees

కార్పొరేట్ లోకంలో మత కల్లోలం – నాసిక్ టీసీఎస్ కంపెనీలో దారుణం

సహనం వందే, నాసిక్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అమాయక మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొందరు కేటుగాళ్లు సాగించిన దౌర్జన్యం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న ఈ దారుణమైన సెక్స్, మత మార్పిడి స్కాండల్ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. పోష్ కమిటీ వైఫల్యంఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది. 2021 నుండి ఇక్కడ…

Read More
Engineering Graduates not getting Jobs

కోడింగ్ రాని ఇంజనీర్ల గోడు – కాలం చెల్లిన ఇంజనీరింగ్ సిలబస్

సహనం వందే, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు పెనుతుఫానులా విరుచుకుపడుతుంటే భారతీయ విద్యావ్యవస్థ పాతకాలపు పాఠాలతో విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కిస్తోంది. లక్షల రూపాయలు పోసి కొన్న ఇంజనీరింగ్ పట్టాలు ఇప్పుడు నిరుద్యోగ పత్రాలుగా మారుతున్నాయి. నైపుణ్యం లేని చదువులతో లక్షలాది మంది యువత ఐటీ కంపెనీల గడప తొక్కలేక అల్లాడుతున్నారు. మార్కెట్ అవసరాలకు, విద్యాబోధనకు మధ్య ఉన్న భారీ అగాధం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకే సవాలుగా మారింది. నైపుణ్యం లేని గ్రాడ్యుయేట్లుభారతదేశంలో ఏటా 15 లక్షల…

Read More
Kavitha BC Bhata

బీసీ బాట… కవిత వేట – గురి పెట్టిన జాగృతి నేత

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ తెరపై మరో సంచలనం మొదలైంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తూ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇది కేవలం అధికారం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. మూడు ప్రధాన పార్టీల కోటలను బద్దలు కొట్టే వ్యూహం. ఈ రాజకీయ చదరంగంలో కవిత వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. బలమైన సామాజిక అస్త్రంతెలంగాణ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు రాజకీయాలకు కీలకంగా మారారు….

Read More
CSK- Dhoni at Uppal Stadium

ఉప్పల్‌లో ధోనీ గర్జన – హైదరాబాద్‌లో అడుగెట్టిన లెజెండ్

సహనం వందే, హైదరాబాద్: క్రికెట్ పిచ్ మీద మౌనంగా ఉంటూనే తుపాను సృష్టించగల మాంత్రికుడు ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచి మైదానానికి దూరంగా ఉన్న ఆ లెజెండ్ రాక కోసం పసుపు చొక్కాల అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. ధోనీ హైదరాబాద్ రావడంతో ఉప్పల్ స్టేడియం ఊగిపోతోంది. గాయం పోయింది…సీజన్ మొదలైన తొలి రెండు వారాలు ధోనీని గ్రోయిన్ గాయం తీవ్రంగా…

Read More