Gleeden App

రాత్రి వేళల్లో రహస్య ముచ్చట్లు – విచ్చలవిడితనానికి వేదిక ‘గ్లీడెన్’ యాప్

సహనం వందే, హైదరాబాద్: జీవితం ఒక రహస్యాల నిలయం. పవిత్రమైన బంధంలో ఉన్నామని లోకానికి చెప్పుకుంటూనే మరో తోడు కోసం ఆరాటపడే మనస్తత్వం నేడు పెరిగిపోతోంది. గ్లీడెన్ అనే యాప్ ఇప్పుడు భారతీయుల ఫోన్లలో నిశ్శబ్దంగా తిష్టవేసింది. పెళ్లయిన వారు మరో వ్యక్తితో రహస్యంగా బంధం పెట్టుకోవడానికి ఇది ఒక వంతెనలా పనిచేస్తోంది. అంకెలు చూస్తుంటే మన నైతిక విలువల గోడలు నెమ్మదిగా బీటలు వారుతున్నాయి. వ్యభిచారానికి డిజిటల్ వేదికగ్లీడెన్ అనేది సాధారణ డేటింగ్ యాప్ కాదు….

Read More
Vitamin Tablets

విటమిన్ గోలీ… ఉత్త గాలి – మల్టీ విటమిన్లతో లాభం సున్నా

సహనం వందే, హైదరాబాద్: ప్రతిరోజూ ఉదయాన్నే ఒక మల్టీ విటమిన్ మాత్ర వేసుకుంటే కొండంత బలం వస్తుందని… వందేళ్లు బతికేస్తామని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు ఈ గోలీల వల్ల శరీరానికి ఒరిగేదేమీ లేదని తాజా పరిశోధనలు తేల్చాయి. ఇవన్నీ కేవలం మార్కెటింగ్ జిమ్మిక్కులేనని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. వృథా ప్రయాసచాలామంది ఆరోగ్యంగా ఉండాలని ఏటా వేల రూపాయలు ఖర్చు చేసి మల్టీ విటమిన్ డబ్బాలు కొంటున్నారు. అమెరికాలో దాదాపు 33 శాతం మంది…

Read More
On Face Bone Smashing

దవడపై ధడేల్ ధడేల్ – అందం కోసం సుత్తితో ముఖంపై దెబ్బలు

సహనం వందే, హైదరాబాద్: అందంగా కనిపించడం కోసం నేటి తరం కుర్రాళ్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అద్దం ముందు నిలబడి తమను తాము చూసుకోవడం మానేసి… ముఖంపై సుత్తులతో బాదుకుంటున్నారు. వినడానికి ఒళ్లు గగుర్పొడిచే ఈ ‘బోన్ స్మాషింగ్’ ధోరణి ఇప్పుడు యువతను పట్టి పీడిస్తోంది. ముఖం ఆకృతిని మార్చుకోవడానికి ఎముకలను విరగ్గొట్టుకోవడం అనే ఈ వెర్రి చర్యలు సామాజిక ఆందోళనకు దారితీస్తున్నాయి. సుత్తితో ఎముకలపై పోట్లు…మగాళ్లు తమ దవడ ఎముకలు బలంగా, పదునుగా ఉండాలని కోరుకుంటున్నారు….

Read More
Indian wedding system

మూడు ముళ్లు… ఆరు ‘ఉరితాళ్లు’ – ఇండియాలో ఏటా పెళ్లి ఖర్చు 10 లక్షల కోట్లు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు. అది లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. కన్నకూతురిని అత్తారింటికి పంపే వేళ తండ్రి పడే తపన, చేసే అప్పులు ఒక జీవితకాలపు భారంలా మారుతున్నాయి. మేకప్ అద్దాల వెనుక దాగిన కన్నీళ్లు, మిరిమిట్లు గొలిపే బంగారు ఆభరణాల వెనుక ఉన్న ఆర్థిక సంక్షోభంపై ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫరీస్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే నివేదికలు…

Read More
AI Vs Techies

అడ్డమీది కూలీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి – టెక్నాలజీ రంగంలో ఉబర్ తరహా బానిసత్వం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ముసుగులో సామాన్యుడి కడుపు కొట్టేందుకు టెక్ ది’గ్గజ’ దొంగలు సిద్ధమయ్యారు. కంప్యూటర్ల మేధస్సు పెరిగితే మనిషికి విలువ పడిపోతుందా అన్న అనుమానం నిజమవుతోంది. ఏఐ వస్తోంది… అంతా మారిపోతుంది అంటూ భయపెడుతూ తెర వెనుక ఖర్చు తగ్గించుకునే నాటకానికి తెర లేపారు. ఇది సాంకేతికత తెచ్చిన వినాశనం కాదు.. కేవలం సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ శక్తులు ఆడుతున్న ఒక తెలివైన జూదం. లాభాల కోసమే ఉద్యోగ కోతలుటెక్ దిగ్గజాలు గెనెరేటివ్ ఏఐ…

Read More
Baba Ashok Karat

బాబా వేషం.. మహిళా శోకం – నాసిక్ బాబా అశోక్ ఖరాత్ అరాచకాలు

సహనం వందే, నాసిక్: మనుషుల నమ్మకం ఒక అగాధమైతే అందులో దొంగ బాబా విసిరే వల ఒక విషాదం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ దేవుడి పేరిట వేషగాళ్లు మాత్రం వేటగాళ్లలా తారసపడతారు. మూఢనమ్మకం కళ్లకు గంతలు కట్టినప్పుడు పవిత్రమైన మంత్రాల సాక్షిగా అపవిత్రమైన పాడు పనులు ఎలా జరుగుతాయో చెప్పే పచ్చి నిజమే ఈ కథనం. సూపర్ నేచురల్ శక్తుల మోసంతనకు అలౌకిక శక్తులు ఉన్నాయని అశోక్ ఖరాత్ ప్రచారం చేసుకున్నాడు….

Read More
Apple 50 Years

అందమైన రూపం… ‘టచ్’ చేస్తే స్వర్గం – యాపిల్ సంస్థకు ఏప్రిల్ 1తో 50 ఏళ్లు పూర్తి

సహనం వందే, హైదరాబాద్: జీవితంలో ఒక్కోసారి మనం అన్నీ కోల్పోయామని అనుకుంటాం. కానీ సరిగ్గా అప్పుడే ఒక చిన్న ఆలోచన మన రాతను మారుస్తుంది. యాపిల్ సంస్థ 50 ఏళ్ల పండుగ చేసుకుంటున్న వేళ ఒకప్పుడు ఆ సంస్థ చనిపోవడానికి కేవలం 90 రోజుల దూరంలో ఉందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అది నిజం. స్టీవ్ జాబ్స్ అనే ఒక యోధుడు తిరిగి వచ్చి కేవలం ఒక తెల్ల కాగితం మీద గీసిన నాలుగు గీతలు ఒక…

Read More
Star Rating Mafia

స్టార్ రేటింగ్… భారీ చీటింగ్ – ఆన్‌లైన్ మార్కెట్లో నకిలీ రివ్యూల మాఫియా

సహనం వందే, హైదరాబాద్: ఆన్‌లైన్ మార్కెట్ ఇప్పుడు నమ్మకద్రోహానికి అడ్డాగా మారింది. మనం నమ్మి కొనే వస్తువు వెనుక ఉన్న 5 స్టార్ రేటింగ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ రాసిన స్క్రిప్ట్ కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని శాసిస్తున్న ఈ నకిలీ రివ్యూల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బ్రిటన్ తాజా విచారణ బయటపెట్టింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసం కూడా అంతే వేగంగా అప్డేట్ అవుతోంది. నమ్మకానికి పాతరబ్రిటన్ పోటీ, మార్కెట్ల అధికార…

Read More
Dhudandhar Vs Pakistan

ధురంధర్ వసూళ్లపై పాకిస్తాన్ లొల్లి – వెయ్యి కోట్లలో సగం వాటాకు ల్యారీ డిమాండ్

సహనం వందే, ముంబై: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాస్తున్న ధురంధర్ ది రివెంజ్ చిత్రం ఇప్పుడు ఒక అంతర్జాతీయ చర్చకు దారితీసింది. కరాచీలోని ల్యారీ మురికివాడ నేపథ్యంలో సాగే ఈ కథ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడంతో అక్కడి స్థానికులు వింత డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. తమ ప్రాంతం పేరును, అక్కడి పరిస్థితులను వాడుకుని కోట్లు గడించిన నిర్మాతలు తిరిగి తమకు వాటా ఇవ్వాలని కోరడం ఇప్పుడు సరిహద్దుల మధ్య చర్చనీయాంశంగా…

Read More
South Vs North

అస్తిత్వ పోరాటపు అంచున దక్షిణాది – భారత్‌లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ప్రస్తుతం ఒక విలక్షణమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకుపోతుంటే… ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా పట్టు బిగిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య పెరుగుతున్న సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు దేశ సమగ్రతకు సవాలుగా మారాయి. ఈ సున్నితమైన అంశంపై జాతీయ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూలో కాంగ్రెస్ నేత శశి ధరూర్ రాసిన కథనం సంచలనం సృష్టిస్తుంది. ఆ స్టోరీలోని కొన్ని కీలకమైన విషయాలు ఇక్కడ చూడవచ్చు….

Read More