Women Related News

సెలబ్రిటీలకు మీడి(ద)యా – మహిళా ఘోష వినపడలేదా?

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఎంత డిజిటల్ మాయాజాలంలో మునిగితేలుతున్నా మహిళల పట్ల వివక్ష మాత్రం పాతాళానికి చేరుతోంది. కృత్రిమ మేధస్సు సాయంతో మహిళలపై జరుగుతున్న హింస కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకవైపు అమానవీయ ఘటనలు పెరుగుతుంటే మరోవైపు మీడియా వాటిని విస్మరిస్తోంది. ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న ఈ ఘోరాలపై లోతైన చర్చ అవసరం. పడిపోయిన ప్రాధాన్యతయూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెంటర్ ఫర్ జర్నలిజం అండ్ డెమోక్రసీ, గ్లోబల్ మీడియా మానిటరింగ్ ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా…

Read More
Delimitation bill And Mahila Reservation Bill

మహిళా బిల్లుకు డీ’లిటిగేషన్’ – మహిళా, డిలిమిటేషన్ బిల్లులకు లింకేంటి?

సహనం వందే, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన కేంద్ర సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి సీట్ల సంఖ్యను పెంచి తద్వారా దక్షిణాది ప్రాబల్యాన్ని తగ్గించాలనే పాలకుల కుట్రను ప్రతిపక్షాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా తెరపైకి తెచ్చిన ఈ నిబంధన రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. కేవలం మహిళల కోటా కోసమే కాకుండా తమ ప్రాంతీయ హక్కుల పరిరక్షణ కోసం…

Read More
TCS Nasik Women Employees

కార్పొరేట్ లోకంలో మత కల్లోలం – నాసిక్ టీసీఎస్ కంపెనీలో దారుణం

సహనం వందే, నాసిక్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అమాయక మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొందరు కేటుగాళ్లు సాగించిన దౌర్జన్యం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న ఈ దారుణమైన సెక్స్, మత మార్పిడి స్కాండల్ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. పోష్ కమిటీ వైఫల్యంఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది. 2021 నుండి ఇక్కడ…

Read More
Engineering Graduates not getting Jobs

కోడింగ్ రాని ఇంజనీర్ల గోడు – కాలం చెల్లిన ఇంజనీరింగ్ సిలబస్

సహనం వందే, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు పెనుతుఫానులా విరుచుకుపడుతుంటే భారతీయ విద్యావ్యవస్థ పాతకాలపు పాఠాలతో విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కిస్తోంది. లక్షల రూపాయలు పోసి కొన్న ఇంజనీరింగ్ పట్టాలు ఇప్పుడు నిరుద్యోగ పత్రాలుగా మారుతున్నాయి. నైపుణ్యం లేని చదువులతో లక్షలాది మంది యువత ఐటీ కంపెనీల గడప తొక్కలేక అల్లాడుతున్నారు. మార్కెట్ అవసరాలకు, విద్యాబోధనకు మధ్య ఉన్న భారీ అగాధం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకే సవాలుగా మారింది. నైపుణ్యం లేని గ్రాడ్యుయేట్లుభారతదేశంలో ఏటా 15 లక్షల…

Read More
Unemployment

నిరుద్యోగ విస్పోటనం – పదేళ్లలో 80 కోట్ల మంది బతుకు భారం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఒక నిరుద్యోగ అగ్నిపర్వతం మీద కూర్చుంది. రాబోయే దశాబ్ద కాలంలో కోట్ల మంది యువతకు ఉపాధి లేక వీధుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు, అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు చేస్తున్న హెచ్చరికలు ఒకే భయానక సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక లెక్కల గారడీ కాదు… వ్యవస్థల వైఫల్యం వల్ల పుట్టుకొస్తున్న సామాజిక దావానలం. ప్రపంచ బ్యాంక్ పేల్చిన బాంబుప్రపంచ బ్యాంకు గ్రూపు అధ్యక్షుడు అజయ్…

Read More
Justice Kurian Committee Report on Delimitation

ఢిల్లీ పెత్తనం… దక్షిణాదిపై ఉక్కుపాదం – జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ ఆవేదన

సహనం వందే, తమిళనాడు: భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ కేవలం జనాభా గణాంకాల ఆధారంగానే సాగితే అది దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఆ కారణంగా పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధిని సాధించినందుకు రివార్డు ఇవ్వాల్సింది పోయి సీట్లు తగ్గించడం ద్వారా శిక్షించడం ఏమాత్రం…

Read More
Gold in India

‘బంగారు’ కొండపై భారత్ – బీరువాల్లో నిద్రపోతున్న లక్షల కోట్ల సంపద

సహనం వందే, హైదరాబాద్: భారతీయ ఇళ్లల్లో బంగారం పరవళ్లు తొక్కుతోంది. మన బీరువాల్లో ఏకంగా 420 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం పోగుపడి ఉందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఈ అపార సంపద అమెరికా, చైనా మినహా ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది కావడం గమనార్హం. ప్రపంచ సెంట్రల్ బ్యాంకులకు సవాల్మన ఇళ్లలో ఉన్న ఈ 420 లక్షల కోట్ల రూపాయల బంగారం… ప్రపంచంలోని టాప్ 10 దేశాల సెంట్రల్ బ్యాంకుల…

Read More
Vaibhav

కాలం కంటే ముందే ఎదిగిన కుర్రాడు – యువ క్రికెటర్ వైభవ్ ‘సిక్సర్’ కథ

సహనం వందే, హైదరాబాద్: జీవితం కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతుంది. కొందరు నడక నేర్చుకునే వయసులో పరిగెత్తడం ప్రారంభిస్తారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సరిగ్గా అదే చేస్తున్నాడు. చేతిలో బ్యాట్ పట్టుకుని మైదానంలో నిలబడితే అతని కళ్లలో కనిపించేది విజయం కాదు… ఒక తరం కల. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యంత పిన్న వయసు రికార్డును చెరిపివేసే దిశగా ఈ చిన్నారి అడుగులు పడుతున్నాయి. ప్రతిభకు పట్టాభిషేకంఅజిత్ అగార్కర్ నేతృత్వంలోని…

Read More
Delimitation effects Southern States

ద’క్షీణ’ భారతం – దక్షిణాది సీట్ల అవసరం లేకుండానే ఢిల్లీ‌ పీఠం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో దక్షిణాది రాష్ట్రాల రాత మాత్రం మారడం లేదు. మనం రెక్కలు ముక్కలు చేసుకుని దేశానికి అన్నం పెడుతుంటే… ఎవరో వచ్చి ఆ పళ్లెం లాక్కుని వెళ్లే కుట్ర ఇది. అభివృద్ధికి మనం నిచ్చెనలవుతుంటే… ఆ నిచ్చెన మెట్లు ఎక్కి పీఠం ఎక్కేది మాత్రం ఉత్తరాది నేతలే. ఇది కేవలం సీట్ల పెంపు కాదు… దక్షిణాది ఆత్మగౌరవంపై జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్. ప్రజాస్వామ్యం అంటే కేవలం తలల లెక్కింపేనా? తెలివితేటలకు, కష్టానికి విలువ…

Read More
Arvind Kejriwal Comments on Delhi High Court Judge

జడ్జిపై కేజ్రీ’ఫైర్’ – ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ సంచలన వాదన

సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని న్యాయస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తనపై ఉన్న కేసును కేవలం రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూనే ఏకంగా న్యాయమూర్తి నిష్పాక్షికతను సవాల్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న సంస్థల కార్యక్రమాలకు న్యాయమూర్తి హాజరయ్యారని ఆరోపిస్తూ ఆయన నేరుగా కోర్టులోనే ధ్వజమెత్తడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తిపై కేజ్రీవాల్ అటాక్లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన…

Read More