మహిళా న్యాయ’బాధలు’ – పురుష అహంకారపు న్యాయ పీఠం
సహనం వందే, హైదరాబాద్: భారత న్యాయవ్యవస్థలో మహిళా లాయర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చట్టం ముందు అందరూ సమానమని చెప్పే కోర్టు గదుల్లోనే లింగ వివక్ష రాజ్యమేలుతోంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సర్వేలో వెల్లడైన చేదు నిజాలు వ్యవస్థలోని కుళ్ళిన సంస్కృతిని బయటపెట్టాయి. 2,604 మంది మహిళా న్యాయవాదుల గొంతుకలు నేడు న్యాయం కోసం నిలదీస్తున్నాయి. నివేదికలోని ప్రతి అంకె ఒక కన్నీటి గాథను వినిపిస్తోంది. ఫీజుల చర్చల వద్ద అవమానంమహిళా లాయర్లు తమ ప్రతిభను…