
ప్రైవేట్ క్యాబ్… మహిళల ట్రాప్ – యూపీఐ చెల్లింపులతో లీకవుతున్న నంబర్లు
సహనం వందే, న్యూఢిల్లీ:క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. ఓలా, ఉబర్, ఇన్‌డ్రైవ్, రాపిడో వంటి ప్రైవేటు రవాణా యాప్‌లు ఎంత గొప్ప భద్రతా హామీలు ఇచ్చినా… డ్రైవర్ల వేధింపులు ఆ హామీల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ముఖ్యంగా యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడం వల్ల మహిళల వ్యక్తిగత ఫోన్ నంబర్లు డ్రైవర్లకు లీక్ అవుతున్నాయి. దానిని అడ్డుపెట్టుకుని వారు వాట్సాప్ లేదా పేటీఎం వంటి వాటిలో అసభ్యకర సందేశాలు పంపడం… వేధించడం సమస్యగా…