
‘వార్’లో గెలిచిన ‘కూలీ’ – బాక్సాఫీస్ యుద్ధంలో బాషా విజయం
సహనం వందే, సినీ బ్యూరో హైదరాబాద్:భారతీయ సినీ చరిత్రలో ఇండిపెండెన్స్ డే వీక్‌లో జరిగిన బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకు పండగలా మారింది. ఒకవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ యాక్షన్ చిత్రం కూలీ, మరోవైపు యువ సంచలనం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన స్పై థ్రిల్లర్ వార్ 2… ఈ రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో హైప్ మధ్య విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలలో కూలీదే పై చేయిగా కనిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్… లోకేశ్…