కేసుల గోల… సనాతన సేవ – విజయసాయిరెడ్డి హిందుత్వ యాత్ర!
సహనం వందే, అమరావతి: మాజీ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఏనాడూ హిందుత్వ గురించి… మత మార్పిడుల గురించి మాట్లాడని ఆయన ఇప్పుడు ఒక్కసారిగా సనాతన ధర్మ పరిరక్షకుడిలా అవతారమెత్తారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదంటూ ఎక్స్ వేదికగా గరంగరంగా పోస్టులు పెడుతున్నారు. డబ్బు ఆశ చూపి మతం మార్చితే బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత మార్పిడులపై కేంద్రం కమిటీ…