తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహజ్వాల
సహనం వందే హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక రోజు సుదీర్ఘ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు సమావేశమై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9వ తేదీ తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు….