
రుచుల విందులో ‘అదుర్స్’ – ప్రపంచంలో 50వ స్థానం హైదరాబాద్
సహనం వందే, హైదరాబాద్:ప్రపంచ ఆహార పటంలో భారతదేశం తన విశిష్టమైన వంటకాలతో మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 ఆహార నగరాల జాబితాలో ఆరు భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది భారతదేశపు అద్భుతమైన, వైవిధ్యమైన వంటకాల వారసత్వానికి నిదర్శనం. ఈ జాబితాలో ముంబై (5వ స్థానం) అగ్రగామిగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో అమృత్‌సర్ (43వ స్థానం), ఢిల్లీ (45వ స్థానం), హైదరాబాద్ (50వ స్థానం), కోల్‌కతా…