
తమిళనాడు వర్సెస్ తెలంగాణ – ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సౌత్ మధ్య వార్
సహనం వందే, హైదరాబాద్:ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు జాతీయ పార్టీల తరఫు కూటములు దక్షిణాదిని రాజకీయ వేదికగా తయారు చేసుకున్నాయి. తమిళనాడు (టి), తెలంగాణ (టి) రాష్ట్రాలను ఈ ఎన్నికల్లో భాగస్వామ్యులను చేశాయి. ఎన్డీఏ కూటమి తరపున తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. దక్షిణాది కేంద్రంగా ఉత్తరాది పెద్దలు ఉపరాష్ట్రపతి ఎన్నికల…