
గ్రహాంతరవాసులతో వినాశనం – స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికలో నిజమెంత?
సహనం వందే, లండన్:ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గ్రహాంతరవాసుల గురించి చేసిన హెచ్చరికలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఆకాశంలో కనిపించే గుర్తు తెలియని వస్తువులు (యూఎఫ్ఓ), గ్రహాంతరవాసుల గురించి రోజురోజుకు ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో హాకింగ్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజల మనసుల్లో ఆందోళన రేపుతున్నాయి. గ్రహాంతరవాసులతో మనకు సంబంధాలు ఏర్పడితే అది మానవ జాతికి ముప్పుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి. గ్రహాంతరవాసులు…