నా ఆస్తి నా ఇష్టం – షర్మిల వాటాకు జగన్ టాటా
సహనం వందే, హైదరాబాద్: తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అంటున్నాడు. రాజకీయంగా చెల్లెలు తనకు వ్యతిరేకంగా మారడంతో ఆమెకు ప్రేమతో ఇచ్చిన వాటాలను కూడా వెనక్కి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించిన జగన్… ఇప్పుడు ఏకంగా చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం ఆస్తి వివాదం కాదని… రాజకీయ వైరమే ప్రధాన కారణమని…