
కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలు
సహనం వందే, హైదరాబాద్:వచ్చే నవంబర్ 9వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలురైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు…