నడిరోడ్డుపై ‘నో’మాజ్ – ఆర్ఎస్ఎస్ నేత అంబేకర్ ఘాటు వ్యాఖ్యలు
సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛ, పౌర క్రమశిక్షణ మధ్య నెలకొన్న సన్నని గీతపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరోసారి గొడ్డలివేటు వేసింది. బహిరంగ రహదారులను ప్రార్థనా స్థలాలుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ ఇస్లామిక్ దేశాల నిబంధనలను ఆర్ఎస్ఎస్ ప్రచార కర్త ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఉదహరించారు. ఇది కేవలం మతపరమైన ఆచారం కాదు… వ్యవస్థాగతమైన అతిక్రమణ అని ఆయన ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు….