‘రాజీవ్’ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) – 1984 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు
సహనం వందే, న్యూఢిల్లీ:1984 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో 414 సీట్ల విజయాన్ని అందించింది కేవలం ఇందిరా గాంధీ సానుభూతి మాత్రమే కాదు… ఆ విజయం వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు ఉందన్న తాజా సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీని పక్కనబెట్టి ఇందిర హత్య తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీకి ఆర్ఎస్ఎస్ నాయకత్వం రహస్యంగా చేయూతనిచ్చిన వైనం ఆసక్తికరమైన రాజకీయ మలుపు. బీజేపీ పుట్టి…