ఆర్టిఫీషియల్ బియ్యం @ 2.0 – తింటే ఆరోగ్యం… వింటే ఆశ్చర్యం!
సహనం వందే, హైదరాబాద్: భారతీయ భోజన పళ్లెంలో ప్రధానమైన తెల్లటి అన్నం ఇప్పుడు ప్రయోగశాలలో రూపాంతరం చెందుతోంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి మధుమేహానికి కారణమవుతున్న సహజ బియ్యానికి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు సరికొత్త డిజైనర్ బియ్యాన్ని సృష్టించారు. ఇది కేవలం ఆహారమే కాదు… సాంకేతికతతో నిర్మించిన ఒక పోషకాల గిడ్డంగి. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. పిండి నుంచి మెరిసే గింజసాధారణంగా బియ్యం పొలాల్లో పండుతాయి. కానీ ఈ సీఎస్‌ఐఆర్ డిజైనర్…