ముంబైపై గుజరాధిపత్యం – రాజ్, ఉద్ధవ్ థాకరేల సంచలన వ్యాఖ్యలు
సహనం వందే, ముంబై: ముంబైపై రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల వేళ 20 ఏళ్ల వైరం వీడి థాక్రే సోదరులు చేతులు కలిపారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే… మరాఠీ మనోభావాలను అస్త్రంగా మలచుకుని బీజేపీపై యుద్ధం ప్రకటించారు. హిందీ భాషా ప్రయోగంపై వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హిందీపై హెచ్చరికహిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే సహించేది లేదని……