అక్కడ 94 శాతం విడాకులే – పోర్చుగల్ దేశం ప్రపంచంలోనే దారుణం
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వివాహ బంధం పునాదులు కదులుతున్నాయి. ఒకప్పుడు పవిత్రంగా భావించిన పెళ్లి నేడు విడాకుల కోర్టుల మెట్ల దగ్గర ఆగిపోతోంది. పశ్చిమ దేశాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో అసలు పెళ్లి అనే వ్యవస్థ ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. పెళ్లిళ్ల సంఖ్యతో పోలిస్తే విడాకుల రేటు ఆకాశాన్ని తాకుతోంది. భారత్ ఆదర్శం…విడాకుల విషయంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ విడాకుల రేటు కేవలం 1…