పట్టు వస్త్రాల కోట్ల స్కామ్ – మరోసారి తిరుమలలో పవిత్రతకు భంగం
సహనం వందే, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి కుంభకోణాల సుడిగుండంలో చిక్కుకుంది. లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, పరకామణిలో చోరీ వంటి వివాదాల తర్వాత తాజాగా టీటీడీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా రూ. 55 కోట్ల విలువైన పట్టు దుపట్టా కొనుగోలు కుంభకోణం వెలుగు చూసింది. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీవారి సేవలో, ఆలయ ఉత్సవాలలో, దాతలకు వేదాశీర్వచనం సమయంలో ఉపయోగించే పవిత్రమైన పట్టు వస్త్రాల విషయంలో ఈ మోసం జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా…