కోటీశ్వరుల క్లబ్‌గా పార్లమెంటు – ఎంపీలలో 93 శాతం మంది కుబేరులే
సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక ఖరీదైన వేలం పాటగా మారిపోయింది. సామాన్యుడి ఓటు హక్కు కంటే సంపన్నుడి నోట్ల కట్టకే విలువ పెరిగింది. ఎన్నికలు అంటే సిద్ధాంతాల యుద్ధం కాస్తా అంకెల గారడీగా మారిపోయింది. వేల కోట్లు కుమ్మరిస్తే తప్ప గెలవలేమన్న నగ్నసత్యం సామాన్యుడిని రాజకీయాలకు దూరం చేస్తోంది. అదృశ్య శక్తుల పెట్టుబడులు మన ఓటు విలువను తగ్గించేస్తున్నాయి. ఇది పండుగ కాదు… ప్రజాస్వామ్య పతనం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను చూస్తుంటే…