ఆన్లైన్ పరీక్ష అల్లకల్లోలం – ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణ అధ్వాన్నం
సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో వ్యవస్థీకృత వైఫల్యాలు బయటపడుతున్నాయి. సాంకేతికత పేరుతో ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. అక్రమాలు, హ్యాకింగ్ భయాల మధ్య పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎన్టీఏ తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తప్పుల తడకగా ఎన్టీఏజాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ వైఫల్యాలు వరుసకడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన 14 పరీక్షల్లో ఐదింటిలో తీవ్ర సమస్యలు తలెత్తాయి. నీట్ యూజీ పేపర్…