
వ్యవసాయ కార్యదర్శికి ఆయిల్ పామ్ సెగ
సహనం వందే, హైదరాబాద్: నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ విషయంపై సోమవారం హైదరాబాదులో విచారణ చేపట్టామని, దానికి ఆ ముగ్గురు కీలక అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాసిరకం మొక్కలకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది….