ఈవీఎంల హ్యాకింగ్… ట్రంప్ షాకింగ్ – అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
సహనం వందే, అమెరికా: అమెరికాలో ఎన్నికల ప్రక్రియపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కంటే పాత కాలపు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికల నిర్వహణే అత్యుత్తమమని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్ మెషీన్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించి పారదర్శకమైన పద్ధతిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ట్రంప్ అమెరికా ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులకు…