
ఎంఎన్ జే డైరెక్టర్ రిటైర్మెంట్ రగడ
సహనం వందే, హైదరాబాద్:నిబంధనల ప్రకారం ఉద్యోగ విరమణ చేయాల్సిన వ్యక్తి… ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ విధుల్లో ఉండడాన్ని మీరు ఎక్కడైనా చూశారా? అంతే కాదు ఒక రాష్ట్రంలో రిటైర్డ్ కావలసిన వ్యక్తి… మరో రాష్ట్రంలో దర్జాగా అధికారికంగా అదే స్థాయి హోదాలో ఉండడాన్ని ఏమనుకోవాలి? అచ్చంగా తెలంగాణలో ఒక డాక్టర్ విషయంలో అదే జరుగుతుంది. హైదరాబాదు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనివాసులును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అక్కడ పోస్టు లేదనే కారణంతో అది…