
మెడిసిటీ విద్యార్థుల ‘మత్తు’ బిజినెస్ – దిక్కులు చూస్తున్న ప్రైవేట్ యాజమాన్యం
సహనం వందే, హైదరాబాద్:మేడ్చల్ మెడిసిటీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులే గంజాయి బిజినెస్ చేస్తున్నారు. మూడేళ్లుగా కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థులు గంజాయిని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రగ్స్‌పై ఈగల్ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో మెడిసిటీ వైద్య విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ టెస్టులో గంజాయి పాజిటివ్ వచ్చిన పలువురు విద్యార్థుల్ని డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించారు. సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేశారని,…