హీరోస్ ఆఫ్ రోడ్… ఫుల్లీ అన్-లోడ్! – ఆగిపోతున్న లారీ చక్రం.. ఆకలి చిత్రం
స్టీరింగ్ పడితేనే వాళ్ల ఇల్లు గడుస్తుంది.. ఆ లారీ చక్రం తిరిగితేనే దేశం కడుపు నిండుతుంది. కానీ గమ్యం తెలియని ప్రయాణంలో వాళ్ల బతుకులే రోడ్డున పడుతున్నాయి. దేశ ఆర్థిక నాడికి రక్తాన్ని అందించే రవాణా సైనికులు నేడు దిక్కులేని అనాథలుగా మారుతున్నారు. నడిరోడ్డుపై నలిగిపోతున్న బతుకులుఅది మండుటెండైనా… వణికించే చలైనా.. ఆరుగాలం లారీ స్టీరింగ్‌తో కుస్తీ పట్టడమే వారి జీవితం. జాతీయ ఆదాయంలో 11 శాతం వాటా అందిస్తున్న రవాణా రంగం వెనుక ఉన్నది రక్తాన్ని…