
రగులుతున్న గిరిజన వివాదం – లంబాడీల ఆత్మగౌరవ పోరాటం
సహనం వందే, కొత్తగూడెం:కొత్తగూడెం పట్టణం లంబాడీల ఆత్మగౌరవ నినాదాలతో హోరెత్తిపోయింది. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ… రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేసు విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ఆదివాసీలతో, మరోవైపు లంబాడీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించడం సమస్యను పరిష్కరించడానికి కాదని,…