పాలల్లో విషం… కిడ్నీలు ఖతం – రాజమండ్రిలో మరణం మృదంగం
సహనం వందే, రాజమండ్రి: రాజమహేంద్రవరంలో పాల సరఫరా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. పాలు తాగిన సామాన్య ప్రజలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. కిడ్నీలు దెబ్బతిని ఐదుగురు అమాయకులు మృత్యువాత పడ్డారు. ఇది కేవలం ప్రమాదం కాదు.. ఒక వ్యవస్థీకృత నేరం. కూలెంట్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ఘోరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. పాల కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు ఏమయ్యాయనే ప్రశ్న తలెత్తుతోంది. విషతుల్యమైన పాలురాజమహేంద్రవరంలో పాల కల్తీ ఉదంతం కలకలం రేపుతోంది. పాల శీతలీకరణ కేంద్రంలో…