ఢిల్లీ పెత్తనం… దక్షిణాదిపై ఉక్కుపాదం – జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ ఆవేదన
సహనం వందే, తమిళనాడు: భారతదేశంలో రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ కేవలం జనాభా గణాంకాల ఆధారంగానే సాగితే అది దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తుందని జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఆ కారణంగా పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధిని సాధించినందుకు రివార్డు ఇవ్వాల్సింది పోయి సీట్లు తగ్గించడం ద్వారా శిక్షించడం ఏమాత్రం…