
యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యం – జాన్ వెస్లీ విమర్శ
సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, రైతులు నెలరోజులుగా యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బీజేపీ నాయకులు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమే కారణమని ఆరోపించారు. కృత్రిమ కొరత పేరుతో బీజేపీ…