పశువైద్యుల గో’మేత – క్యాన్సర్ ప్రాజెక్టు నిధులతో జల్సాలు
సహనం వందే, జబల్ పూర్: గోమాతను పూజించే దేశంలో ఆవు పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేసే పరిశోధనల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కొందరు అధికారులు తమ విలాసాలకు వాడుకున్నారు. పరిశోధనలు పక్కన పెట్టి విలాసవంతమైన కార్లు, విమాన ప్రయాణాలతో ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా తగలేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని నానాజీ దేశ్ముఖ్ పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆవుల…