
హిందువుల ఎమోషన్… ఐఫోన్ ప్రమోషన్! – కాషాయ రంగులో ప్రత్యేకంగా ఐఫోన్ 17
సహనం వందే, న్యూఢిల్లీ:కాషాయ రంగుతో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు దేశంలో రాజకీయ రంగు పులుముకుంది. ఇది హిందువుల కోసమే తయారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనతగా ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకునే యాపిల్ ఈ ఫోనును తీసుకొచ్చిందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక మొబైల్ ఫోన్ రంగును రాజకీయ ప్రచారంగా మార్చేశారని విమర్శకులు…