విద్వేషంతో కోట్ల వర్షం – భారత్-పాక్ ఆటతో 2000 కోట్ల ఆదాయం
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు ఆరంభం కాకముందే వ్యాపార సామ్రాజ్యంలో ప్రకటనల యుద్ధం మొదలైంది. ఇది కేవలం 22 గజాల పిచ్ మీద జరిగే ఆట కాదు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పగను పెట్టుబడిగా మార్చుకుంటున్న మహా వ్యాపార కుతంత్రం. దేశభక్తి ముసుగులో కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కరచాలనం లేని క్రీడా దౌత్యంకొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే మ్యాచ్కు ముందు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. టాస్…