మూడు ముళ్లు… ఆరు ‘ఉరితాళ్లు’ – ఇండియాలో ఏటా పెళ్లి ఖర్చు 10 లక్షల కోట్లు
సహనం వందే, హైదరాబాద్: భారతీయ వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు. అది లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. కన్నకూతురిని అత్తారింటికి పంపే వేళ తండ్రి పడే తపన, చేసే అప్పులు ఒక జీవితకాలపు భారంలా మారుతున్నాయి. మేకప్ అద్దాల వెనుక దాగిన కన్నీళ్లు, మిరిమిట్లు గొలిపే బంగారు ఆభరణాల వెనుక ఉన్న ఆర్థిక సంక్షోభంపై ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫరీస్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే నివేదికలు…