
విదేశాల్లో విద్యార్థనాదాలు – ఆరేళ్లలో 842 మంది భారత విద్యార్థుల మృతి
సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఉన్నత విద్య… మంచి ఉద్యోగం… మెరుగైన జీవితం అనే కలల రెక్కలు కట్టుకుని కడలి దాటిన భారతీయ యువ హృదయాలు అక్కడి ప్రమాదాల్లో ఆరిపోతున్నాయి. 2018 నుంచి 2024 వరకు ఈ ఆరేళ్లలో ఏకంగా 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఆశ… ఒక యువకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కలల మాటున కన్నీళ్ల కథభారతీయ విద్యార్థులకు కలల గమ్యంగా…