
తెలంగాణ ఆయిల్ ఫెడ్ నర్సరీలలో కేంద్ర బృందం
సహనం వందే, అశ్వారావుపేట: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాల మేరకు భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు గురువారం అశ్వారావుపేట, దమ్మపేటల్లో పర్యటించారు. నర్సరీలు, జన్యు లోపం ఉన్న మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందం పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. ఐఐఓపీఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఎంవీ ప్రసాద్, రామచంద్రుడు సహా ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే అశ్వారావుపేట ఆయిల్…