ప్రజావాణి … ‘హైడ్రా’బాణి – రంగనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
సహనం వందే, హైదరాబాద్:హైడ్రా ప్రజల పక్షాన నిలుస్తోంది. ప్రజా గొంతుకగా మారుతుంది. అందుకోసం హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా ప్రజావాణి చేపట్టారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 58 ఫిర్యాదులందాయి. ఇందులో అధికభాగం పార్కుల కబ్జాలు, రహదారుల ఆక్రమణలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కాజేత ప్రయత్నాలపై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. గూగుల్ మ్యాప్స్, లేఔట్లతో పాటు.. ఎన్ఆర్ ఎస్‌సీ, సర్వే ఆఫ్ ఇండియా, గ్రామ రికార్డులను ఫిర్యాదుదారుల ముందే ఆన్‌లైన్లో…