
‘సృష్టి’ అధికారులపై ఉక్కుపాదం – వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ హెచ్చరిక
సహనం వందే, హైదరాబాద్: ‘సృష్టి’ ఫెర్టిలిటీ వంటి సెంటర్లలో అక్రమాలకు వీలు కల్పించిన ప్రభుత్వ అధికారులు, మెడికల్ కౌన్సిల్ వంటి సంస్థల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని… అందులో బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. మాతృత్వం ఆశతో వచ్చేవారిని వ్యాపార వస్తువులుగా మార్చిన కొన్ని ఐవీఎఫ్ కేంద్రాలు, సరోగసి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సృష్టి తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని…