నీళ్లు లేని ఫైరింజన్లు
సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జర్ హౌస్‌లో 18న ఘోర అగ్నిప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ, పోలీసు, వైద్య విభాగాల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబీకులను కోల్పోయామని ఆవేదనతో మీడియా ముందుకు వచ్చారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సన్నద్ధత లేమి ఈ విషాదానికి ప్రధాన…