విదేశీ ఎంబీబీఎస్ …దేశీ పరీక్ష ఫెయిల్…డాక్టర్ల ప్రైవేట్ దందా
సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతారు… కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ నే ఎండీ అంటారు. అలా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారు మన దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ డాక్టర్లుగా చలామణి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇటువంటి వారిని డాక్టర్లుగా నియమించుకుంటున్నాయి. నెలకు పాతిక వేలు జీతం ఇస్తే చాలని విదేశీ ఎంబీబీఎస్ అభ్యర్థులు భావిస్తుండటంతో, తక్కువ వేతనాలతోనే ఆసుపత్రులు…