‘సృష్టి’కి సాయం… అమ్మకు ద్రోహం -ఫెర్టిలిటీ సెంటర్లకు వైద్యాధికారుల వత్తాసు
సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదులో అనేక ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్లు నడుపుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సంతానం లేని దంపతులకు అక్రమ పద్ధతిలో శిశువులను అంటగట్టుతున్నారు. నగరంలో దాదాపు 180 ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా… కొన్ని సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరు వైద్యాధికారుల చేయూతతోనే ఈ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకుగాను కొందరు వైద్యాధికారులకు…