
సీజన్ బాగుంది… యూరియా ఏదండి – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతన్న గోస
సహనం వందే, హైదరాబాద్:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ గొడవలతో తెలంగాణ రైతాంగం నలిగిపోతోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రానికి కావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోర నిర్లక్ష్యం చూపుతోందని, రైతుల బతుకులతో ఆడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగితాల మీద కేటాయింపులు చేసినట్లు చూపించి, నిజానికి సరఫరాలో లోటు తెచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. కాగితాలపైనే కేటాయింపులు…తెలంగాణకు ఈ ఖరీఫ్ సీజన్‌లో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది….