
ఇంటి గుట్టు… రహస్యం రట్టు – ఏపీలో ఫ్యామిలీ కార్డులకు శ్రీకారం
సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఫ్యామిలీ కార్డు సెగలు రేపుతోంది. ప్రజల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్డులను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్పుతోంది. అయితే దాని వెనుక ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి నిఘా పెట్టే కుట్ర ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటి సర్వేల పేరుతో ప్రజల ఆస్తులు, ఆదాయ వివరాలు సేకరించి రాజకీయ లబ్ధికి వాడుకున్నారని వచ్చిన విమర్శల…