
మా దేశం… మా కోసం – టూరిస్ట్ గోబ్యాక్ – యూరోపియన్ల నినాదం
సహనం వందే, యూరప్:ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థానిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ‘మా దేశం మా కోసమే’నని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. టూరిస్టుల పేరుతో తమ అందమైన నగరాలను నాశనం చేస్తున్నారని… తమ జీవనశైలిని, సంస్కృతిని, ఉనికిని ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆదాయ వనరుగా భావించిన పర్యాటకం ఇప్పుడు యూరప్‌లోని అనేక నగరాలకు సమస్యగా మారింది. పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక సంస్కృతి, జీవనశైలి దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బార్సిలోనా నుంచి…